ఆహారభద్రత చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి

ABN , First Publish Date - 2021-10-22T07:06:42+05:30 IST

ఆహారభద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఫుడ్‌ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కె.తిరుమల్‌రెడ్డి అన్నారు. కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికతో కలిసి ఆహార భద్రత చట్టంపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆహారభద్రత చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న తిరుమల్‌రెడ్డి

ఆహార భద్రత కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి 

సూర్యాపేట (కలెక్టరేట్‌), సూర్యాపేటరూరల్‌, అక్టోబరు 21: ఆహారభద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఫుడ్‌ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కె.తిరుమల్‌రెడ్డి అన్నారు. కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికతో కలిసి ఆహార భద్రత చట్టంపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంగన్‌వాడీ కేంద్రాలను, పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌లు విజిలెన్స్‌ కమిటీ చైర్మన్లుగా వ్యవహరించాలని, చట్టం అమలుపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. లబ్ధిదారుల హక్కులకు ఎలాంటి భంగం కలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు భారతి, శారద, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, కిషోర్‌కుమార్‌, పీడీ కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య, ఐసీడీఎస్‌ పీడీ జ్యోతిపద్మ, డీఎంహెచ్‌వో కోటాచలం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్ర సమీపంలోని పిల్లలమర్రి దేవాలయాలను తిరుమల్‌రెడ్డి గురువారం సందర్శించి, పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T07:06:42+05:30 IST