Abn logo
Oct 24 2021 @ 22:52PM

ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

క్రీడాకారులతో నుడా చైర్మన్‌ తదితరులు

నెల్లూరు (క్రీడలు), అక్టోబరు 24 : ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాఽథ్‌ ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మొత్తం 12 ఫుట్‌బాల్‌ క్లబ్‌లను ఆహ్వానించి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి శనివారం, ఆదివారం ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సెట్నల్‌ సీఈవో పుల్లయ్య, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఆర్‌కే యతిరాజ్‌, ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి బీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.