ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం వద్దని చెప్పలేం

ABN , First Publish Date - 2020-08-09T08:54:00+05:30 IST

ట్రాఫిక్‌ నియంత్రణకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు అవసరమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం అభిప్రాయపడ్డారు. కొద్దిమందికి ఇబ్బంది కలుగుతుందనే కారణంతో విస్తృత ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టలేమన్న న్యాయమూర్తి...

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం వద్దని చెప్పలేం

  • విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అవసరమే: హైకోర్టు


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ నియంత్రణకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు అవసరమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం అభిప్రాయపడ్డారు. కొద్దిమందికి ఇబ్బంది కలుగుతుందనే కారణంతో విస్తృత ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టలేమన్న న్యాయమూర్తి.. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంలో జోక్యం చేసుకోడానికి నిరాకరించారు. అయితే సాధ్యమైనంత మేరకు అసౌకర్యం తగ్గించేలా నిర్మాణం చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల సమీపంలోని ‘రుహైనా అపార్ట్‌మెంట్‌ ముందు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అపార్ట్‌మెంటు యజమానుల సంఘం, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఎటువంటి సెట్‌బ్యాక్‌ లేకుండా అపార్ట్‌మెంటు ముందే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించినట్లయితే.. 74 కుటుంబాలకు అసౌకర్యంగా మారుతుందని వారు కోర్టుకు తెలిపారు. ఈ అభ్యర్థనలు విన్న న్యాయమూర్తి.. ఎక్కువ మంది ప్రయోజనాలకోసం కొద్దిమందికి అసౌకర్యంగా కలిగినా తప్పదని వ్యాఖ్యానించారు. ఎంతో వ్యయంతో నిర్మిస్తున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను చాలా మంది  వినియోగించడం లేదని, ర్యాంపులు, ఎస్కలేటర్లు వంటి  సౌకర్యాలు లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. ఎత్తైన మెట్ల కారణంగా వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు వాటిని వినియోగించడం లేదని న్యాయమూర్తి అన్నారు.


Updated Date - 2020-08-09T08:54:00+05:30 IST