ఆ మాస్కులతో ఫుట్‌బాల్‌ మైదానం నింపొచ్చు!

ABN , First Publish Date - 2021-01-18T07:29:46+05:30 IST

మాస్క్‌ల విషయంలో చాలామంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పారవేసి, ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారకులుగా నిలుస్తున్నారు.

ఆ మాస్కులతో ఫుట్‌బాల్‌ మైదానం నింపొచ్చు!

న్యూఢిల్లీ, జనవరి 17: మాస్క్‌ల విషయంలో చాలామంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పారవేసి, ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారకులుగా నిలుస్తున్నారు. ఢిల్లీలోని ప్రతి 100 మందిలో కనీసం ముగ్గురు ఇలా ఇష్టానుసారంగా పారవేసే మాస్క్‌లతో.. ప్రతిరోజు ఒక ఫుట్‌బాల్‌ మైదానాన్ని నింపేయొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఒక సాధారణ మాస్కు 175 మిల్లీమీటర్ల పొడవు, 95 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది. 60 మాస్క్‌లను ఒకదాని పక్కన ఇంకొకటి పేర్చితే.. ఒక చదరపు మీటరు దూరాన్ని ఆక్రమిస్తాయి. ఈ లెక్కన 4.28 లక్షల మాస్క్‌లను వరుసగా పేర్చితే.. ఫుట్‌బాల్‌ మైదానమంత స్థలం (7,140 చదరపు మీటర్లు) అవసరమవుతుంది. దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజూ దాదాపు 30 లక్షల మాస్క్‌లను వినియోగిస్తుంటారు. ఒకవేళ వారంతా ప్రతిరోజు ఒక మాస్క్‌ను పారవేస్తే.. వాటితో 7 ఫుట్‌బాల్‌ మైదానాలను నింపొచ్చని అంచనా వేశారు. 

Updated Date - 2021-01-18T07:29:46+05:30 IST