స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్‌ కోసం

ABN , First Publish Date - 2022-01-25T06:43:38+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నల్లగొండ మునిసిపాలి టీ డబుల్‌ డిజిట్‌ ర్యాంకు సాధించే లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పాలిథిన్‌ కవర్ల నిషేధంపై అవగాహన, ఇంట్లోనే సేంద్రియ ఎరువుల తయారీపై మహిళలకు అవగాహన కల్పించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్‌ కోసం

డబుల్‌ డిజిట్‌పై దృష్టి

ప్రతీ బుధవారం పారిశుధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌

ఇళ్లలోనే కంపోస్ట్‌ ఎరువుల తయారీపై అవగాహన

ఆత్మనిర్భర్‌ వార్డుగా గుర్తించేందుకు సన్నాహాలు


రామగిరి, జనవరి 24: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నల్లగొండ మునిసిపాలి టీ డబుల్‌ డిజిట్‌ ర్యాంకు సాధించే లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పాలిథిన్‌ కవర్ల నిషేధంపై అవగాహన, ఇంట్లోనే సేంద్రియ ఎరువుల తయారీపై మహిళలకు అవగాహన కల్పించారు. అంతేగాక అధికారులు ప్రతీ వార్డులో పర్యటించి సీనియర్‌ సిటిజన్ల గుర్తించడంతోపాటు, మునిసిపల్‌ సేవలపై వారి నుంచి సలహా లు, సూచనలు తీసుకోనున్నారు.

నీలగిరి మునిసిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నా యి. ప్రతీ వార్డులో తడి, పొడి చెత్తను వేర్వేరుగా మునిసిపల్‌ సిబ్బందికి అందించడంతోపాటు, ఇంట్లోనే సేంద్రియ ఎరువు తయారుచేయడం, పాలిథిన్‌ కవర్ల నిషేధాన్ని పటిష్టంగా అమలుచేసే వార్డులను ఆత్మనిర్భర్‌ వార్డులుగా గుర్తిస్తారు. అదేవిధంగా జీరో వేస్ట్‌ ఈవెంట్‌ కింద ప్రతి హోటల్‌, ఫంక్షన్‌ హాల్‌లో ప్లాస్టిక్‌ ప్లేట్లు, పాలిథిన్‌ కవర్లు వినియోగించకుండా నోటీసులు జారీ చేశారు. వీటి స్థానం లో స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్‌ కవర్లతో అనర్థాలు, కంపోస్ట్‌ ఎరువుల తయారీతో ఉపయోగాలపై పట్టణంలోని హోర్డింగ్‌ల ద్వారా ప్రచారం చేయనున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదనే నినాదాలను ప్రతీ పబ్లిక్‌ టాయిలెట్‌పై రాయించనున్నారు. కమర్షియల్‌ జోన్లలో 50 నుంచి 100 మీటర్ల చెత్త డబ్బాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేసేవారికి జరిమానా విధించనున్నారు. 


ప్రజలకు అవగాహన

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020లో నీలగిరి మునిసిపాలిటీకి 262 ర్యాంకు లభించింది. 2021లో 179 ర్యాంకుతో పాటు ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌ ర్యాంకు వచ్చింది. ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో ఫలితాలు కన్పిస్తుండటంతో ఈ ఏడాది రెండు అంకెల ర్యాంకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూసేందుకు వారికి అవగాహన కల్పించడంతోపాటు సలహాలు, సూచన లు స్వీకరించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదే విధం గా స్వచ్ఛ సర్వేక్షణపై పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్‌, వాల్‌ఆర్ట్‌ పోటీలు నిర్వహించి ప్రశంసాపత్రాలు అందజేసి వారికి అవగాహన కల్పిస్తున్నారు. దీంతోపాటు పట్టణంలో ఉత్తమ హాస్టల్‌, విద్యాలయాలు, కాలనీలను గుర్తించి వాటి బాధ్యులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. అంతేగాక పట్టణంలో ప్రతీ బుధవారం పారిశుధ్యం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు.


డబుల్‌ డిజిట్‌ ర్యాంకే లక్ష్యం : రమణాచారి, నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌

నల్లగొండ మునిసిపాలిటీకి 99లోపు ర్యాంకు తేవడమే లక్ష్యం. ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నాం. పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి మునిసిపల్‌ సిబ్బందికి అందించడంతో పాటు తడి చెత్తతో సేంద్రియ ఎరువును రూపొందించేలా అవగాహన కల్పిస్తున్నాం. డబుల్‌ డిజిట్‌ ర్యాంకు లభిస్తే పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు వచ్చే అవకాశం ఉంటుంది.


Updated Date - 2022-01-25T06:43:38+05:30 IST