రెండోసారి మద్యంతో చిక్కిన యువకుడికి రూ.50 వేల జరిమానా

ABN , First Publish Date - 2021-05-14T05:12:59+05:30 IST

మద్యం అక్రమంగా తరలిస్తూ రెండోసారి పట్టుబడిన యువకుడికి రూ.50 వేల జరిమానా విధించిన సంఘటన గురువారం పీటీఎం మండలంలో జరిగింది.

రెండోసారి మద్యంతో చిక్కిన యువకుడికి   రూ.50 వేల జరిమానా

పెద్దతిప్పసముద్రం, మే 13: మద్యం అక్రమంగా తరలిస్తూ రెండోసారి పట్టుబడిన యువకుడికి రూ.50 వేల జరిమానా విధించిన సంఘటన గురువారం పీటీఎం మండలంలో జరిగింది. ములకలచెరువు ఎస్‌ఈబీ సీఐ మురళీకిషోర్‌ వివరాల మేరకు.. పీటీఎంకు చెందిన కె. అఫ్జల్‌బాషా జనవరిలో మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. అప్పట్లో అతడికి 110సీఆర్‌పీసీ ప్రకారం పీటీఎం తహసీల్దారు ఎదుట హాజరు పరచి రూ.50వేలకు పూచీకత్తుపై విడుదల చేశారు. అయితే అఫ్జల్‌బాషా తాజాగా మరోసారి కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతడిని పీటీఎం తహసీల్దారు కళావతి ఎదుట హాజరుపరచగా రూ.50వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. దీంతో అతడి వద్ద నుంచి అధికారులు రూ.50వేల చలానా కట్టించారు. ఎవరైనా రెండోసారి మద్యం తరలిస్తూ పట్టుబడితే  ఇలాగే జరిమానా విధిస్తామని, వారి హిస్టరీ షీట్‌ ఓపెన్‌చేసి పీడీ యాక్ట్‌ పెట్టాల్సివస్తుందని ఎస్‌ఈబీ సీఐ హెచ్చరించారు.

Updated Date - 2021-05-14T05:12:59+05:30 IST