అన్నిరకాల పోషకాల కోసం!

ABN , First Publish Date - 2021-03-06T05:49:46+05:30 IST

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పప్పుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటాం. అయితే వీటిని సమస్థాయిలో తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. 2 వారాల ఫిట్‌నెస్‌ ప్రాజెక్ట్‌ను అనుసరిస్తున్న

అన్నిరకాల పోషకాల కోసం!

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పప్పుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటాం. అయితే వీటిని సమస్థాయిలో తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. 2 వారాల ఫిట్‌నెస్‌ ప్రాజెక్ట్‌ను అనుసరిస్తున్న ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన డైట్‌ ప్లాన్‌ గురించి పంచుకున్నారు. పప్పుధాన్యాల విషయంలో అనుసరించాల్సిన మూడు నియమాలను 


ఇలా వివరిరస్తున్నారు...

మొదటి నియమం: వంటకు ఉపయోగించే ముందు పప్పుధాన్యాలను మొలకలు వచ్చేంత వరకు నానబెట్టాలి. ఇలా చేస్తే వాటిలోని యాంటీ న్యూట్రియెంట్లు తగ్గిపోతాయి. ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర లవణాలను ఎంజైమ్‌లు సమర్థంగా ముక్కలుగా చేస్తాయి. 


రెండో నియమం: పప్పుధాన్యాలలోని అత్యవసర, అత్యవసరం కాని అమైనో ఆమ్లాలను పెంచేందుకు వాటిని తృణధాన్యాలు, ఆహారధాన్యాలతో కలిపి వండాలి. అన్నంతో అయితే 1-3 పాళ్లలో, చిరుధాన్యాలు, ఆహారధాన్యాలతో అయితే 1-2 మోతాదులో తీసుకోవాలి.


మూడో నియమం: అయిదు రకాల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు లేదా లెగ్యూమ్‌ జాతి గింజలను అయిదు రూపాల్లో నెలలో తప్పనిసరిగా తినాలి. ఇలా చేస్తే అన్ని రకాల పోషకాలు అందుతాయి. 

Updated Date - 2021-03-06T05:49:46+05:30 IST