అభిమానుల నుంచి తప్పించుకునేందుకు గొడుగు అడ్డం పెట్టుకుని బయటకు వచ్చిన షారూక్ ఖాన్..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై బయట ఉన్నాడు. కొడుకు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పటి నుంచి కింగ్ ఖాన్ అభిమానులకు కనిపించడం లేదు. బయటకు వచ్చిన గానీ అభిమానులు, మీడియా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి నవంబర్ 7న ముంబైలోని ప్రైవేటు ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.


అభిమానుల నుంచి తప్పించుకునేందుకు షారూక్  ప్రయత్నించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో  షారూక్ గొడుగు అడ్డం పట్టుకుని ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడం కనిపించింది. ‘‘ షారూక్ బృందం ఢిల్లీ నుంచి అత్యంత రహస్యంగా వచ్చింది. వారు వచ్చిన ప్రైవేటు విమానం కలినా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది ’’ అని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి రాశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేయడం మొదలైంది. దీంతో నెటిజన్లు షారూక్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘ కొడుకు చేసిన అవమానం‌తోనే ముఖాన్ని దాచుకుని ప్రయాణించాల్సి వస్తోంది ’’ అని ఒక నెటిజన్ ట్రోల్ చేశారు.  మరికొందరు  డ్రగ్ వాలా, డ్రగ్గీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ప్రతి ఏడాది నవంబర్ 2న షారూక్ బర్త్‌డే సందర్భంగా తన ఇంటి నుంచి బయటకు వచ్చి అభిమానులను కలుస్తుంటారు. కానీ, ఈ ఏడాది మాత్రం ఆ విధంగా చేయలేదు.  షారూక్ బర్త్‌డే సందర్భంగా అతడి నివాసమైన మన్నత్ వద్దకు అనేక మంది అభిమానులు వచ్చారు. ప్రతి  ఏడాది లాగానే ఈ సారి కూడా శుభాకాంక్షలు తెలుపుదామనుకున్నారు. అభిమానుల ఆశలను ఆవిరి చేస్తూ నటుడు మాత్రం వారికి దర్శనమివ్వలేదు.  


Advertisement

Bollywoodమరిన్ని...