మెదడు ఆరోగ్యం కోసం...

ABN , First Publish Date - 2021-08-03T05:30:00+05:30 IST

మెక్కల్లో సహజసిద్ధంగా తయారయ్యే ఫ్లేవనాయిడ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. మరీ ముఖ్యం

మెదడు ఆరోగ్యం కోసం...

పైబడే వయసుతో మతిమరుపు, ఆలోచనల్లో స్పష్టత లోపించడం లాంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి ఇబ్బందులను అడ్డుకోవాలంటే స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లు తినాలి.


మెక్కల్లో సహజసిద్ధంగా తయారయ్యే ఫ్లేవనాయిడ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. మరీ ముఖ్యంగా పసుపుపచ్చ, నారింజ రంగుల్లోని పండ్లలో మరింత మెరుగైన యాంటీఆక్సిడెంట్లు దొరుకుతాయి. ఆరోగ్య రక్షణ కల్పించే గుణాలు పుష్కలంగా కలిగి ఉండే ఈ రకం పండ్లతో మెదడు క్షీణతను 38ు అడ్డుకోవచ్చు. దీన్నిబట్టి ఇలాంటి ఫ్లేవనాయిడ్లు తీసుకున్న వారి మెదడు, అసలు వయసు కంటే నాలుగేళ్లు యవ్వనంగా ఉంటుంది.


వంద గ్రాముల మిరియాల్లో 5 మిల్లీగ్రాముల ఫ్లేవన్స్‌ ఉంటాయి. బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, చెర్రీ పండ్లలో ఉండే యాంథోసయానిన్లు కాగ్నిటివ్‌ క్షీణతను 24ు తగ్గిస్తాయి. 100 గ్రాముల బ్లాక్‌బెర్రీలలో 164 మిల్లీగ్రాముల యాంథోసయానిన్‌ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలం పాటు మెదడు ఆరోగ్యం దిగజారకుండా ఉండాలంటే ఫ్లేవనాయిడ్లు, యాంథోసయానిన్లు పుష్కలంగా ఉండే పండ్లు తినాలి.


Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST