నిండైన బుగ్గల కోసం...

ABN , First Publish Date - 2021-07-25T05:30:00+05:30 IST

చర్మం కాంతులీనుతున్నా బుగ్గలు నిండుగా లేకపోతే రూపం ఆకర్షణీయంగా కనిపించదు. అంతేకాకుండా వయసు పైబడుతున్న కొద్దీ బుగ్గలు తగ్గిపోతుండటం జరుగుతూ ఉంటుంది.

నిండైన బుగ్గల కోసం...

చర్మం కాంతులీనుతున్నా బుగ్గలు నిండుగా లేకపోతే రూపం ఆకర్షణీయంగా కనిపించదు. అంతేకాకుండా వయసు పైబడుతున్న కొద్దీ బుగ్గలు తగ్గిపోతుండటం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చబ్బీ చీక్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...

ఒక చిన్న పాత్రలో పది టీస్పూన్ల రోజ్‌వాటర్‌లో డైల్యూట్‌ చేయని చిక్కటి గ్లిజరిన్‌ను కలిపి సీరం తయారుచేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ సీరమ్‌ను అప్లై చేసుకోవాలి. గ్లిజరిన్‌ ముడతలను తగ్గిస్తుంది. రోజ్‌ వాటర్‌ చర్మాన్ని శుభ్రపరిచి మొటిమలను దూరం చేస్తుంది. ఈ రెండింటిని కలిపి ఉపయోగించడం వల్ల బుగ్గలు చబ్బీగా తయారవుతాయి.

ఒక బౌల్‌లో ఆపిల్‌ ముక్కలు, బొప్పాయి ముక్కలు తీసుకోవాలి. వీటిని మెత్తగా చేసి అందులో రెండు టీస్పూన్ల తేనె, ఆరు టీస్పూన్ల పాలు కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై మసాజ్‌లా చేయాలి. పావుగంట పాటు అలా చేసిన తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. రోజులో రెండుసార్లు, వారం రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఆపిల్‌లో విటమిన్‌ బి12, అమైనో యాసిడ్స్‌ చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. బొప్పాయి ముడతలను తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్‌ను దూరం చేస్తుంది. ఈ ఫేస్‌ప్యాక్‌ కొల్లాజెన్‌ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. 

ఈ ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగించడంతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, గుడ్‌ఫ్యాట్‌ ఉండే డైట్‌ను ఫాలో కావాలి. ఆపిల్స్‌, క్యారెట్స్‌, ఓట్స్‌, తేనె, పాలు, నట్స్‌, డార్క్‌ చాక్లెట్‌, కోడిగుడ్లు, అవొకడో వంటి వాటిని తీసుకోవాలి. 

కొన్ని ఫేసియల్‌ వ్యాయామాలు కూడా ఉపకరిస్తాయి. బెలూన్‌ ఊదడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. పెదాలతో ‘’ ఆకారం వేసి చేతి వేళ్లలో బుగ్గలను పైకి, కిందకు కదపాలి. అర నిమిషం పాటు, ఐదారు సార్లు చేయాలి. వీలైనంత గాలిని బుగ్గల నిండుగా పట్టి అరనిమిషం తరువాత వదిలేయాలి. ఈ వ్యాయామం ఐదు సార్లు చేయాలి. పెదాలను దగ్గరగా ఒత్తిపెట్టి బుగ్గల కండరాలను చేతివేళ్లతో మసాజ్‌ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.      

Updated Date - 2021-07-25T05:30:00+05:30 IST