చెత్తసేకరణకు రూ. 2 వసూలు చేయాలి

ABN , First Publish Date - 2020-06-02T09:58:19+05:30 IST

మనం-మనపరిశుభ్రత పథకం ద్వారా చెత్త సేకరణకు ప్రతి ఇంటి నుంచి రూ. 2 చొప్పున వసూళ్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు.

చెత్తసేకరణకు రూ. 2 వసూలు చేయాలి

మనం-మన పరిశుభ్రత ప్రారంభంలో ఎమ్మెల్యే కిలివేటి


తడ,  జూన్‌ 1 : మనం-మనపరిశుభ్రత పథకం ద్వారా చెత్త సేకరణకు ప్రతి ఇంటి నుంచి రూ. 2 చొప్పున వసూళ్లు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే తన స్వ గ్రామం కాదలూరులో మనం-మనపరిశుభ్రతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, ట్రైనీ డీఎస్పీ షాను, సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎంపీడీవో శివయ్య, తహసీల్దారు శాంతకుమారి పాల్గొన్నారు. 


మనుబోలు : మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో మనం-మనపరిశుభ్రత కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ హరనాథ్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఈవోఆర్‌డి శేఖర్‌బాబు, కార్యదర్శి హిమబిందు  పాల్గొన్నారు.


వెంకటాచలం :  స్థానిక గ్రామ సచివాలయం వద్ద నిర్మించిన చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.  గ్రామ వీధుల్లో ఉన్న చెత్తను ఆయన స్వయంగా ఊడ్చి చెత్త తరలించే వాహనాల్లో వేశారు. ఆయన వెంట ఎంపీడీవో  సరళ, తహసీల్దారు, ఐఎస్‌ ప్రసాద్‌, వైసీపీ నేతలు మందల వెంకటశేషయ్య  ఉన్నారు.


దొరవారిసత్రం : మండలంలోని మినమనమూడి గ్రామంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య  అధ్యక్షతన  మనం - మన పరిశుభ్రతపై సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీపీవో ధనలక్ష్మి చెత్త సమస్యను భాగస్వామ్య పద్ధతిలో పరిష్కరించేందుకు  ప్రతి కుటుంబం నెలకు రూ. 60 కమిటికీ చెల్లించాలని, గ్రామంలోని చెత్తను గ్రీన్‌ గార్డులు సేకరించి, వర్మీకంపోస్టు యార్డ్‌కు తరలిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, తహసీల్థారు పద్మావతి, ఈవోఆర్‌డి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:58:19+05:30 IST