నిగనిగలాడే చర్మం కోసం...

ABN , First Publish Date - 2021-04-18T05:30:00+05:30 IST

ప్రతిరోజుఎరోబిక్స్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌లాంటి వ్యాయామాలు చేయడం వల్ల చర్మం కాంతిమంతంగా, ఆరోగ్యంగా

నిగనిగలాడే చర్మం కోసం...

 ప్రతిరోజుఎరోబిక్స్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌లాంటి వ్యాయామాలు చేయడం వల్ల చర్మం కాంతిమంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.  


 చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే కంటి నిండా నిద్ర చాలా అవసరం. మంచి నిద్రవల్ల కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం తగ్గిపోతుంది.


 సాధ్యమైనంత వరకు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎ, సి, ఇ విటమిన్లు ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు తినాలి. పాల ఉత్పత్తులు, నట్స్‌, ఆకుకూరలు, నిమ్మ, నారింజ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 


 అరటిపండ్లు, గుడ్లు, గింజధాన్యాలు, చేపలు, కొవ్వు తొలగించిన మటన్‌, చికెన్‌ వంటివి మెనూలో ఉండేలా చూసుకోవాలి. అల్లం, జింక్‌ లభ్యమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవడం కూడా ఉత్తమం. ఠి రోజూ ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఎండలో బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవడం తప్పనిసరి. తద్వారా మచ్చలు, చర్మంపై వచ్చే ముడతలు ఏర్పడకుండా జాగ్రత్తపడొచ్చు. 


 పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. స్మోకింగ్‌ వల్ల దంతాలు పాడవడమే కాకుండా కళ్ల కింద నల్లగా మారుతుంది. చర్మం కాంతిని కోల్పోతుంది. పాసివ్‌ స్మోకింగ్‌ కూడా చాలా దుష్ప్రభావాలను చూపిస్తుంది. కాబట్టి పొగతాగే వారికి దూరంగా ఉండాలి.


Updated Date - 2021-04-18T05:30:00+05:30 IST