ఆరోగ్యంగా ఉండాలంటే...

ABN , First Publish Date - 2021-07-26T18:01:57+05:30 IST

ఉద్యోగాలు, పనులు, టార్గెట్‌లతో బిజీ జీవితం గడిపే వారిలో అధికశాతం ఆరోగ్యంపై దృష్టిని కేంద్రీకరించలేరు. పనులతో తీరిక లేకున్నా సరే కొన్నింటిని తీరిక చేసుకుని మరీ ఫాలో అవ్వాల్సిందే.

ఆరోగ్యంగా ఉండాలంటే...

ఆంధ్రజ్యోతి(26-07-2021)

ఉద్యోగాలు, పనులు, టార్గెట్‌లతో బిజీ జీవితం గడిపే వారిలో అధికశాతం ఆరోగ్యంపై దృష్టిని కేంద్రీకరించలేరు. పనులతో తీరిక లేకున్నా సరే కొన్నింటిని తీరిక చేసుకుని మరీ ఫాలో అవ్వాల్సిందే. 


రొటీన్‌కు భిన్నంగా... 

ఎప్పుడు చూసినా పని, తీరిక దొరికితే ఊరికే కూర్చోవడం కాకుండా కాస్త కొత్తగా ఆలోచించాలి. పిల్లలతో ఆడుకోవడంతో పాటు వంటింట్లోకి వెళ్లి గరిటె తిప్పాలి. కొత్త ప్రదేశాలకు వెళ్లాలి. అపుడు మీకు మీరే డిఫరెంట్‌గా కనిపిస్తారు. 


సరైన సమయంలో...

వేళకు తినటం ఎంతో ముఖ్యం. చక్కెర ఉండే ఆహారాన్ని తీసుకోవడం బదులు మంచినీళ్లు తాగడం మంచిది. నూనె పదార్థాలు, కొవ్వును పెంచే మాంసాహారంను అతిగా తినొద్దు. కూరగాయలు, పండ్లు సీ ఫుడ్‌ను మెనూలో ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎంత పనిచేసినా, ఎంత సంపాదించినా సరైన సమయానికి తినకుంటే అనారోగ్యమే అంటూ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 


తగినంత నిద్ర... 

రోజుకు కనీసం ఏడు గంటలు నిద్ర ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. అలా చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రీఫ్రె్‌షలాంటిది నిద్ర. మంచి నిద్రవల్ల జ్ఞాపకశక్తి, మూడ్‌ బావుంటుంది. ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.


వర్కవుట్స్‌ తప్పనిసరి... 

ఉదయాన్నే లేవగానే నడక మంచిది. మీ ఇంటి దగ్గర అనువుగా లేకుంటే ఇంట్లోనే కూర్చుని లేవడం, జంపింగ్‌ జాక్స్‌, పుషప్స్‌, యోగా లాంటివి మంచిదే. ఇలా చేస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆనందంగా ఉండొచ్చు. 

Updated Date - 2021-07-26T18:01:57+05:30 IST