రుణ పరిమితి ఖరారు

ABN , First Publish Date - 2020-06-06T10:30:43+05:30 IST

అన్నదాతలకు బ్యాంకుల ద్వారా అందించే పెట్టుబడి రుణాల పరిమి తి ఖరారు చేశారు. 2020-2021 అర్థిక

రుణ పరిమితి ఖరారు

వానాకాలం పంటలకు రూ. 590 కోట్ల మేరకు రుణాలు 

రబీలో రూ. 388 కోట్లకు రూ. 318.25 కోట్ల పంపిణీ

జిల్లాలో వానాకాలం పంటల లక్ష్యం 2.50 లక్షల ఎకరాలు 

వరి 1.10 లక్షల ఎకరాలు.. పత్తి 1.30 లక్షల ఎకరాలు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): అన్నదాతలకు బ్యాంకుల ద్వారా అందించే పెట్టుబడి రుణాల పరిమి తి ఖరారు చేశారు. 2020-2021 అర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్‌ లిమిటెడ్‌ (టెస్కాబ్‌) ఆధ్వర్యంలో పంట సాగు వ్య యం ఆధారంగా రుణ పరిమితిని నిర్దేశించారు. నిర్దేశించిన పరిమితిని బట్టి రుణాలకు బ్యాంకర్లు వానాకాలం పంటలకు అందించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2లక్షల87వేల385 ఎకరాల్లో పంటల సాగు ఉంది. ఇందులో వ్యవసాయ బావులు, బోరు బావుల కింద 1,21,480 ఎకరాలు సాగవుతుండగా, చెరువుల కింద 15,060 ఎకరాలు, కాలువల కింద 6,230 ఎకరాలు, సాగు చేయనున్నారు.


వర్షం అధారంగా 1,44,615 ఎకరాలు సాగు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో వానాకాలం పంటల్లో 2లక్షల50వేల220 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో వరి 1.10 లక్షల ఎకరాలు, పత్తి 1.30 లక్షల ఎకరాలు, కందులు 8వేల ఎకరాలు, సోయాబీన్‌ 25 ఎకరాలు, జొన్నలు 80 ఎకరాలు, పెసర్లు వెయ్యి ఎకరాలు, మినుములు 150 ఎకరాలు, చెరకు 150 ఎకరాలు, ఇతర పంటలు 815 ఎకరాలు సాగు చేయనున్నట్లు అంచనాలు వేశారు. పంటలకు నీటివనరులు కలిగిన చోట, నీటి వనరు లు లేని చోట రుణ పరిమితిని వేర్వేరుగా నిర్ణయించారు. నీటి సదుపా యం ఉన్నచోట రుణం ఎక్కువగా, తక్కువగా ఉన్నచోట తక్కువ రుణం అందించనున్నారు. 


పరిమితి అందేనా... 

జిల్లాలో రైతులకు రుణ పరిమితి మేరకు రుణాలు అందడంలేదు. వి విధ రకాల పంటలను సాగు చేస్తున్న రైతులు మొత్తంగా రుణాలను పొందలేకపోతున్నారు. బ్యాంకర్లు కరుణిస్తేనే రుణాలు అందే అవకాశం ఉంది. గత వానాకాలం పంటల్లో రుణాలు రూ.560 కోట్లు లక్ష్యంగా పె ట్టుకోగా ఈ సారి రూ.590 కోట్ల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉం ది. ముగిసిన రబీ సీజన్‌లో రూ.388 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 38,385 మంది రైతులకు రూ. 318.25 కోట్లు మాత్రమే రుణాలను అందించారు. 


రుణ పరిమితి ఇలా... (ఎకరానికి)

పంట కనిష్టం గరిష్టం

వరి 34,000 35,000

మొక్కజొన్న 24,000 25,000

జొన్నలు 21,000 22,000

పల్లి 24,000 25,000

మిర్చి 50,000 52,000

పత్తి 35,000 37,000

పసుపు 60,000 65,000

చెరకు 45,000 50,000

నువ్వులు 12,000 13,000

పొగాకు 27,000 30,000

గోదుమ 10,000 12,000

పొద్దుతిరుగుడు 20,000 22,000

కందులు 16,000 18,000

సోయాబీన్‌ 22,000 24,000

కూరగాయలు 38,000 40,000

పువ్వులు 29,000 33,000

మామిడి 35,000 37,000

అముదం 12,000 13,000


Updated Date - 2020-06-06T10:30:43+05:30 IST