వన్‌టైం సెటిల్‌మెంట్‌కు 3.3 లక్షల పక్కాగృహాలకు అర్హత

ABN , First Publish Date - 2021-10-27T04:42:36+05:30 IST

జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణాలు పొంది నిర్మించుకున్న 3.3 లక్షల పక్కాగృహాలు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హత ఉన్నట్లు గుర్తించామని హౌసింగ్‌ జేసీ విదేహి ఖరే తెలిపారు.

వన్‌టైం సెటిల్‌మెంట్‌కు 3.3 లక్షల పక్కాగృహాలకు అర్హత
తహసీల్దారుతో మాట్లాడుతున్న జేసీ విదేహి ఖరే

 హౌసింగ్‌ జేసీ విదేహి ఖరే

సంగం, అక్టోబరు 26: జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణాలు పొంది నిర్మించుకున్న 3.3 లక్షల పక్కాగృహాలు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హత ఉన్నట్లు గుర్తించామని హౌసింగ్‌ జేసీ విదేహి ఖరే తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మండల కేంద్రంలోని సంగం -1, 2 సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టరు, పెండింగ్‌ దరఖాస్తులు తదితర అంశాలపై ఆరా తీశారు.  దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలించి సర్టిఫికెట్‌లను జారీ చేయాలని తహసీల్దారు నిర్మలానందబాబాను ఆదేశించారు. అనంతరం పక్కాగృహ రుణ లబ్ధిదారుల సంఖ్య ఎంత, సర్వే ఎన్ని పేర్లకు పూర్తయింది, మిగిలినవి ఎన్నిరోజుల్లో పూర్తి చేస్తారని సంగం వీఆర్వోలను ప్రశ్నించారు. సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేంద్రబాబు, వీఆర్వోలు మోహన్‌, నాయబ్‌రసూల్‌, లక్ష్మీనారాయణ, సచివాలయ కార్యదర్శులు శ్రీకాంత్‌ ఉన్నారు.






Updated Date - 2021-10-27T04:42:36+05:30 IST