నోటి శుభ్రత కోసం...

ABN , First Publish Date - 2021-06-17T08:12:32+05:30 IST

కరోనా లాంటి ప్యాండమిక్‌ పరిస్థితుల్లో నోటి శుభ్రత మీద దృష్టి పెట్టాల్సిన అవసరముందని వైద్యులు అంటున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌లు..

నోటి శుభ్రత కోసం...

కరోనా లాంటి ప్యాండమిక్‌ పరిస్థితుల్లో నోటి శుభ్రత మీద దృష్టి పెట్టాల్సిన అవసరముందని వైద్యులు అంటున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌లు ఎక్కువశాతం నోటినుంచే లోపలికి వెళ్తాయి. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం.


  • ఎక్కడికెళ్లినా మాస్క్‌ తప్పనిసరి. ఎక్కువ సమయం మాస్క్‌ ధరించడం వల్ల నోటిలో తడి ఆరిపోతుంది. ముక్కుకి శ్వాస సరిగా అందదు. మాస్క్‌ తీసినపుడు నోటితో కూడా గాలి తీసుకోవాలనిపిస్తుంది. మొత్తానికి మాస్క్‌ ధరించడం వల్ల డీహైడ్రేషన్‌ కూడా కలిగే అవకాశం ఉంది. అందుకే రోజులో ఎంత బిజీగా ఉన్నా.. ఎక్కువ నీటిని తాగాలి. దీని వల్ల నోటిలో దుర్వాసన ఉండదు.
  • ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవటం వల్ల మినరల్స్‌, పోషకాలు అందుతాయి. 
  • చక్కెర ఉండే తీపి పదార్థాలు, ఆల్కహాల్‌, మితిమీరిన బేకరీ ఫుడ్స్‌, చిప్స్‌ లాంటివి తినకపోవడం మంచిది. 
  • ఉదయాన్నే కనీసం నాలుగు నిమిషాలపాటు బ్రష్‌ చేయాలి. నోటితో నీళ్లను పుక్కిలించడం, నాలుక శుభ్రపరచుకోవడం చేయాలి.
  • అతిగా పండ్లు తోమడం, నాలుకమీద టంగ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయడం ద్వారా నోటికి ఉపయోగపడే బ్యాక్టీరియాలు నశించిపోతాయని గుర్తుంచుకోవాలి.
  • దంతాలపై పాచి పెరగకుండా చూసుకోవాలి. దంతాలకు సంబంధించిన సమస్యలొస్తే దంత వైద్యున్ని సంప్రదించాలి. దీని వల్ల నోరు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవచ్చు.

Updated Date - 2021-06-17T08:12:32+05:30 IST