Advertisement
Advertisement
Abn logo
Advertisement

తండ్రి మందలించినందుకు..

పాలకవీడు, డిసెంబరు 6: దురలవాట్లకు బానిస కావొద్దని తండ్రి మందలించినందుకు కుమారుడు  ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎస్‌ఐ సైదులుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొత్తల పాలెంకు చెందిన 22 ఏళ్ల గోపీ ఓ పెట్రోలు బంకులో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. దురలవాట్లకు బానిస కావొద్దని తండ్రి సైదులు ఆయనను మందలించాడు. మనస్తాపం చెందిన గోపీ పెట్రోల్‌ బంకుకు వెళుతున్నానని ఈనెల మూడో తేదీ ఇంట్లో నుంచి బయ టికి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు  చుట్టుపక్కల గ్రామాల్లో వెదికినా, బంధువులను వాకబు చేసినా అతడి ఆచూకీ తెలియరాలేదు. అక్క జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారుAdvertisement
Advertisement