సచివాలయాల పరీక్షలకు..

ABN , First Publish Date - 2020-09-22T08:24:26+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు రెండో రోజైన సోమవారం అభ్యర్థుల హాజరుశాతం మరింత తగ్గింది. తొలిరోజున 71శాతం అభ్యర్థులు హాజరు కాగా రెండో రోజు ఉదయం పరీక్షకు 62.90

సచివాలయాల పరీక్షలకు..

తగ్గిన హాజరు శాతం


గుంటూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు రెండో రోజైన సోమవారం అభ్యర్థుల హాజరుశాతం మరింత తగ్గింది. తొలిరోజున 71శాతం అభ్యర్థులు హాజరు కాగా రెండో రోజు ఉదయం పరీక్షకు 62.90 శాతం, మధ్యాహ్నం పరీక్షకు 69.98శాతం మంది హాజరయ్యారు. ఉదయం 59 పరీక్ష కేంద్రాల్లో 9,204 మంది హాజరు కావాల్సి ఉండగా 5,790 మంది వచ్చారు.


30 మంది కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు, ఏడుగురు పాజిటివ్‌ వచ్చిన అభ్యర్థులు ఐసోలేషన్‌ గదుల్లో పరీక్ష రాయించారు. మ ధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 55 కేంద్రాల్లో 6,629 మం దికి 4,633 మంది హాజరయ్యారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ నగరంలోని ఏసీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌లోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్‌ మోహన్‌రావు, స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T08:24:26+05:30 IST