రైతు ముంగిటకే సేవలు

ABN , First Publish Date - 2020-05-30T10:21:40+05:30 IST

వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అన్నిరకాల సేవలను రైతు ముంగిటకే చేర్చే లక్ష్యంతో రాష్ట్ర

రైతు ముంగిటకే సేవలు

నేడు భరోసా కేంద్రాలు ప్రారంభం

జిల్లాలో 879 ఏర్పాటు

బి. నిడమానూరులో 

జిల్లాస్థాయి కార్యక్రమం

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ప్రత్యక్ష ప్రసారం


ఒంగోలు, మే 29 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అన్నిరకాల సేవలను రైతు ముంగిటకే చేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. జిల్లాలో మొత్తం 879 కేంద్రాలను శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వీటిని అమరావతి నుంచి ముఖ్యమంత్రి వై.ఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా రైతులతో కూడా మాట్లాడనున్నారు. అదే సమయంలో జిల్లాస్థాయిలో అధికారికంగా నాగులుప్పలపాడు మండలం బి. నిడమానూరులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, నందిగం సురేష్‌, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తదితరులు పాల్గొననున్నారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  అమరావతి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్బారా ఇక్కడ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. అలాగే వ్యవసాయ, అనుబంధశాఖల ద్వారా స్టాల్స్‌  కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి ఏర్పాట్లను జేసీ-1 వెంకట మురళి, ఎమ్మెల్యే సుధాకరబాబు, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మిగిలిన చోట్ల ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించనున్నారు. 

Updated Date - 2020-05-30T10:21:40+05:30 IST