Abn logo
Sep 24 2021 @ 00:00AM

తేనెటీగల సంరక్షణ కోసం...!

ఈ చిత్రం చూడండి. కొండకు వరుసగా కొన్ని వందల బాక్సులు ఏర్పాటు చేసిన దృశ్యం కనువిందుగా ఉంది కదూ! ఇంతకీ ఆ బాక్సులు ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ ప్రాంతం ఎక్కడుంది?


 అడవి తేనెటీగల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన బాక్సులు అవి. చైనా హుబే ప్రావిన్స్‌లోని షెన్నోంనిజియా నేచర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో కనిపిస్తుందీ దృశ్యం. 



 చైనాలో కనిపించే ఏపిస్‌ సెరనా సెరనా అనే ఒకరకమైన తేనెటీగలు అంతరించేపోయే దశలో ఉన్నాయి. అటువంటి అరుదైన జాతి తేనెటీగలను ఇక్కడ శాంక్చరీలలో సంరక్షిస్తున్నారు. 


 తేనెటీగలను ఆకర్షించడం కోసం ఎత్తైన కొండ వాలుకు బాక్సులను అమర్చారు. ఎలుగుబంట్ల నుంచి రక్షణ కోసం అలా కొండ వాలుకు వాటిని ఏర్పాటు చేశారు. ఆ బాక్సుల్లో కొన్ని వేల తేనెటీగలు వచ్చి చేరుతుంటాయి. తాడు సహాయంతో బాక్సుల వద్దకు చేరి తేనె సేకరిస్తారు. 


ప్రత్యేకం మరిన్ని...