గ్రామాల అభివృద్ధ్ధి కోసమే ‘పల్లె ప్రగతి’: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-30T09:26:43+05:30 IST

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతరం

గ్రామాల అభివృద్ధ్ధి కోసమే ‘పల్లె ప్రగతి’: కలెక్టర్‌

చిలుకూరు, మే 29: గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతున్నాయని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో  భూరికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ కార్య్యక్రమం నిర్వహించి  గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కలు నాటడం, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తామన్నారు. వర్షాలకు కురవంగానే జిల్లాలో హరితహార కార్యక్రమం నిర్వహిస్తాన్నారు.


జిల్లా వ్యాప్తంగా 82 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించడానికి  భూములను గుర్తించామన్నారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు వేదికలను నిర్మిస్తామన్నారు. నియంత్రిత సాగులో భాగంగా జిల్లా వ్యాప్తంగా  వరి సన్నరకాలు, సాగు చేయడానికి అనుకూలంగా ఉందని, త్వరలోనే నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.  భూరికార్డులు పరిశీలించిన అనంతరం మండల కేంద్రంలోని వన నర్సరీని ఆయన పరిశీలించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీవో కిషోర్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివా్‌సశర్మ, ఎంపీడీవో ఈదయ్య, సర్పంచ్‌ కొడారి బాబు, ఎంపీవో యర్రయ్య, ఆర్‌ఐ మంజుల, వీఆర్వో శ్రీను, గ్రామకార్యదర్శి కిరణ్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T09:26:43+05:30 IST