గొంతు సమస్యలకు...

ABN , First Publish Date - 2020-03-17T06:36:49+05:30 IST

జీర్ణక్రియ అస్తవ్యస్తం కావడంతో కొందరిలో గొంతు ఒరుసుకుపోతుంది. గొంతు వద్ద ఏదో నొక్కుతున్న భావన కలగడం, తెమడ జిగటగా ఉండి బయటికి రావడం కష్టం కావడం...

గొంతు సమస్యలకు...

జీర్ణక్రియ అస్తవ్యస్తం కావడంతో కొందరిలో గొంతు ఒరుసుకుపోతుంది. గొంతు వద్ద ఏదో నొక్కుతున్న భావన కలగడం, తెమడ జిగటగా ఉండి బయటికి రావడం కష్టం కావడం, కొండనాలుకలో వాపు కనిపిస్తాయి. ఈ స్థితిలో సల్ఫర్‌, సేఫియా, ఆర్సెనిక్‌ ఆల్బ్‌  వంటి మందులు బాగా పనిచేస్తాయి. బ్రయోనియా, పల్సటిల్లా,  మందులు కూడా ఉపయోగించవచ్చు.


కొందరిలో జీర్ణాశయ సమస్యల వల్ల గొంతు, గవద బిళ్లలు ఎర్రబారడం, గొంతు ఒరిపిడికి గురికావడంతో పాటు  గొంతు పొడిబారినా దప్పిక అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో సాయంత్రం వేళ ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. చలివేయడంతో పాటు గొంతులో జిగటగా అంటుకుపోతున్న భావన కలుగుతుంది. ఇలాంటి వారికి పల్సటిల్లా మందు బాగా పనిచేస్తుంది. 

- బి. అనిల్‌ కుమార్‌, హోమియో వైద్యులు, హైదరాబాద్‌

Updated Date - 2020-03-17T06:36:49+05:30 IST