వెటర్నరీ అధ్యాపక పోస్టులకు 22లోపు దరఖాస్తు చేయండి

ABN , First Publish Date - 2021-05-18T06:52:53+05:30 IST

తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ బ్యాక్‌లాగ్‌ పోస్టులకు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టీ మాధవరావు పేర్కొన్నారు.

వెటర్నరీ అధ్యాపక పోస్టులకు   22లోపు దరఖాస్తు చేయండి

తిరుపతి(విద్య), మే 17: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ బ్యాక్‌లాగ్‌ పోస్టులకు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టీ మాధవరావు పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. తమదరఖాస్తుకు డీడీ కాపీని జతపరచి పీడీఎఫ్‌ రూపంలో మెయిల్‌ చేయాలన్నారు. అనంతరం హార్డ్‌ కాపీలను వచ్చే నెల 14లోపు వర్సిటీకి చేర్చాలన్నారు. 

Updated Date - 2021-05-18T06:52:53+05:30 IST