శీతాకాలం నొప్పులకు...

ABN , First Publish Date - 2021-01-07T06:59:37+05:30 IST

శీతాకాలంలో చిన్న దెబ్బ తగిలినా వాపు వస్తుంది. నొప్పి ఒకపట్టాన తగ్గదు. ఈ నొప్పిని తగ్గించేందుకు అల్లం బాగా పనిచేస్తుంది.

శీతాకాలం నొప్పులకు...

చలికాలంలో చాలామంది ఒంటి నొప్పులతో బాధపడుతుంటారు. వీటిని తగ్గించేందుకు పనొకొచ్చే కొన్ని వంటింటి టిప్స్‌ కొన్ని...


  శీతాకాలంలో చిన్న దెబ్బ తగిలినా వాపు వస్తుంది. నొప్పి ఒకపట్టాన తగ్గదు. ఈ నొప్పిని తగ్గించేందుకు అల్లం బాగా పనిచేస్తుంది. అల్లాన్ని మెత్తగా గ్రైండ్‌ చేసి వస్త్రంలో చుట్టి వేడి నీళ్లల్లో దాన్ని ఒక నిమిషం ఉంచి నీటిని పిండాలి. దాన్ని   వాపు/గాయం ఉన్న చోట పెట్టుకోవాలి.


  ఈ సీజన్‌లో తలెత్తే ఒళ్లు నొప్పులను తగ్గించడంలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కూడా బాగా పనిచేస్తుంది. ఒక బకెట్‌ గోరువెచ్చటి నీళ్లల్లో కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసుకుని స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి.


 దాల్చినచెక్క కూడా శీతాకాలంలో తలెత్తే రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌, ఒళ్లునొప్పులకు బాగా పనిచేస్తుంది. వాపుని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను పోగొడుతుంది. దాల్చినచెక్క పొడి కలిపిన పాలు తాగితే ఒళ్లునొప్పులు తగ్గుతాయి.  


  రాత్రిపూట గోరువెచ్చటి పాలలో పసుపు వేసుకుని తాగితే ఈ కాలంలో వచ్చే ఒంటినొప్పులు, ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫ


Updated Date - 2021-01-07T06:59:37+05:30 IST