ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , First Publish Date - 2021-10-20T04:58:39+05:30 IST

అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్‌ కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైంది. సుమారు రెండు సంవత్సరాలుగా మూతపడిన ఈ కర్మాగారం గత నెల ఒకటిన తిరిగి మొదలైంది. మొదట్లో రెగ్యులర్‌ కార్మికులకు మాత్రమే విధులు కేటాయించారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

జేఎస్‌ఎల్‌లో ఉత్పత్తి ప్రారంభం

కొత్తవలస,  అక్టోబరు 19:  అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్‌ కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైంది. సుమారు రెండు సంవత్సరాలుగా మూతపడిన ఈ కర్మాగారం గత నెల ఒకటిన తిరిగి మొదలైంది. మొదట్లో రెగ్యులర్‌ కార్మికులకు మాత్రమే విధులు కేటాయించారు. సుమారు నెల రోజుల పాటు నిర్వహణ పనుల అనంతరం ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ పరిశ్రమలో సుమారు 100 మంది వరకు రెగ్యులర్‌ కార్మికులు, 330 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా... రెగ్యులర్‌ కార్మికులందరికీ పూర్తిస్థాయిలో విధులు కేటాయించారు. ఉత్పత్తిని బట్టి కాంట్రాక్టు కార్మికులకు పని కల్పిస్తారు. ప్రస్తుతం కర్మాగారంలో తక్కువఉత్పత్తి చేసే చిన్న ఫర్నేసు ద్వారా మాత్రమే ఉత్పత్తి ప్రారంభించడం వల్ల 60 మంది కాంట్రాక్టు కార్మికులే విధులకు హాజరవుతున్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యాక కాంట్రాక్టు కార్మికులందరికీ పని కల్పిస్తామని యాజమాన్యం కార్మిక సంఘాలకు తెలిపింది.


Updated Date - 2021-10-20T04:58:39+05:30 IST