బలవంతపు వసూళ్లు ఆపాలి

ABN , First Publish Date - 2021-12-07T06:07:01+05:30 IST

ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పేదలను ప్రభు త్వం వేధిస్తోందని, వెంటనే వాటిని మానుకోవాలని టిడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

బలవంతపు వసూళ్లు ఆపాలి
కదిరిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

ఓటీఎస్‌ పేరుతో దోపిడీని విరమించుకోవాలి..

అంబ్కేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ నాయకుల వినతి

కదిరి, డిసెంబరు 6 : ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పేదలను ప్రభు త్వం వేధిస్తోందని, వెంటనే వాటిని మానుకోవాలని టిడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అంబేద్కర్‌ వర్థంతి సందర్బంగా స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం ఆయన పాదాల వద్ద ఉంచి, నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాజ్యం గా హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని చెప్పారు. పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లపై ఓటీఎస్‌ పేరుతో బలవంతపు వసూళ్ల పాల్పడు తోందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాజ్యంగ వ్య వస్థలను  ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. ఓటీఎస్‌ పేరుతో చేస్తున్న బలవంతపు వసూళ్లు మానుకోకపోతే టీడీపీ పేదల పక్షాన పోరా డుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు షేక్‌బాబ్‌జాన్‌, టీడీపీ నాయకులు రాజశేఖర్‌బాబు, పాల రమణ, డైమండ్‌ ఇర్ఫాన్‌, షా ఇమ్రాన్‌, రఘనాథ్‌, కొయ్య రాజేంద్రనాయుడు, సాలంకి హను మంతరావు, శేషు, యర్రగుంటపల్లి చౌదరి, సులేమాన్‌, రఘ, నాగప్ప, మనోహర్‌గౌడ్‌, మనోహర్‌ నాయుడు తదతరులు పాల్గొన్నారు

ధర్మవరం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని టీడీపీ రాష్ట్రకార్యదర్శి కమతం కాటమయ్య అన్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీసూచనల మేరకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ ఆదేశాల మేరకు డాక్టర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక కళాజ్యోతిలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మెడపై కత్తిపెట్టి వసూళ్లు చేస్తున్న ఓటీఎస్‌ పద్ధతిని వెంటనే విరమించుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ అధికార ప్రతినిధి పురుషోత్తంగౌడ్‌, మాజీ జడ్పీటీసీ మేకలరా మాంజినేయులు, తెలుగుమహిళా నాయకురాళ్లు సాహెబ్బీ, బీబీ, కత్తుల సునీత, సునంద, నాయకులు భీమనేని ప్రసాద్‌నాయుడు, పరిశేసుధాకర్‌, రుద్రారవి, రాం పురం శీన, పఠాన్‌బాబుఖాన్‌, గంగారపు రవి, రేగాటిపల్లి నాగేంద్రరెడ్డి, చిగిచెర్ల రాఘవరెడ్డి, చీమల రామాంజి, గరుగు వెంగప్ప, హోటల్‌ మారు తీస్వామి, కత్తుల బాబ్జీ, చిన్నూర్‌ విజయ్‌చౌదరి, అశ్వర్థనాయుడు, చికెన్‌ రాము, ఓంప్రకాశ్‌, బొట్టుకిష్ట, కిరోసిన్‌ పోతలయ్య, తిప్పేపల్లి వెంకటరా ముడు, ఇర్షాద్‌, వాసు, శివరాం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T06:07:01+05:30 IST