ఇంట్లో కూడా మాస్క్‌లు ధరించాల్సి వచ్చింది..ఢిల్లీ వాయు కాలుష్యంపై CJI NV Ramana ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-13T17:31:51+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు...

ఇంట్లో కూడా మాస్క్‌లు ధరించాల్సి వచ్చింది..ఢిల్లీ వాయు కాలుష్యంపై CJI NV Ramana ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు బలవంతంగా ఇళ్లలో కూడా మాస్క్‌లు ధరించాల్సి వచ్చిందని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.


రైతులు పొలాల్లో పొట్టును తగలబెట్టేందుకు యంత్రాలను అందుబాటులో ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది.అంతకుముందు శుక్రవారం అధికారులు బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో గాలి నాణ్యత అత్యవసర స్థాయికి చేరుకోవడంతో వాహన వినియోగాన్ని కనీసం 30 శాతం తగ్గించాలని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను ఆదేశించారు.


Updated Date - 2021-11-13T17:31:51+05:30 IST