South Africa నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు ఇచ్చారు

ABN , First Publish Date - 2021-12-04T18:10:38+05:30 IST

దక్షిణాఫ్రికా దేశంతోపాటు పలు విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మంది ప్రయాణికులు తమ చిరునామాలు, ఫోన్ నంబర్లను తప్పుగా ఇచ్చారని ఆరోగ్యశాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది....

South Africa నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు ఇచ్చారు

వారిని గుర్తించేందుకు రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ 

లక్నో (ఉత్తరప్రదేశ్): దక్షిణాఫ్రికా దేశంతోపాటు పలు విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మంది ప్రయాణికులు తమ చిరునామాలు, ఫోన్ నంబర్లను తప్పుగా ఇచ్చారని ఆరోగ్యశాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నగరానికి వచ్చిన 300 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో 13 మంది తప్పుడు చిరునామాలు అందించారని, వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులను వారి ఇళ్లకు పంపిస్తున్నామని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ తెలిపారు. 


వారి ఇళ్లు కనిపించకుంటే, వారిని గుర్తించేందుకు స్థానిక ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం ఇస్తున్నట్లు అధికారి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 300 మందిలో 13 మంది తప్పుడు మొబైల్ నంబర్లు, చిరునామాలు ఇచ్చారు. తమకు అందించిన వివరాల ద్వారా వారి ఆచూకీ తెలుసుకోవడానికి లోకల్ ఇంటెలిజెన్స్ అధికారులను రంగంలోకి దించామని ఆరోగ్యశాఖ డాక్టర్ చెప్పారు.దేశంలో దిగిన తర్వాత విదేశీ ప్రయాణికుల జాడ లేకుండా పోయారని అధికారులు చెప్పారు.బెంగళూరు విమానాశ్రయం నుంచి తప్పిపోయిన మరో 10 మంది ప్రయాణికులను గుర్తించడానికి కర్ణాటక రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒమైక్రాన్ సోకిన 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడిని కనుగొనడానికి కూడా అధికారులు యత్నిస్తున్నారు.


Updated Date - 2021-12-04T18:10:38+05:30 IST