లఖింపూర్ కేసులో ట్విస్ట్.. కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే!

ABN , First Publish Date - 2021-11-09T22:20:02+05:30 IST

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్‌లో వందలాది మంది రైతులు నిరసన చేపట్టారు. అదే సమయంలో కేంద్రమంత్రి అశిష్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ రైతులను..

లఖింపూర్ కేసులో ట్విస్ట్.. కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే!

లఖ్‌నవూ: లఖింపూర్ కేసు మరో కిలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంద్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆ సమయంలో కాల్పులు జరిపాడని మంగళవారం ఫొరెనిక్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటనలో ఆశిష్ మిశ్రాతో పాటు అంకిత్ దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఫొరెనిక్స్ రిపోర్ట్ పేర్కొంది. నిరసన ప్రదేశంలో జరిగిన కాల్పులకు సంబంధించిన రిపోర్ట్‌లు పరిశీలించగా ఆశిష్ మిశ్రాకు చెందిన లైసెన్స్‌డ్ తుపాకీ నుంచే ఆ బుల్లెట్లు వచ్చాయని తెలిపారు.


ఇప్పటికే ఈ కాల్పులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజాగా దీనికి ఫొరెనిక్స్ రిపోర్ట్ స్పష్టం చేయడంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మరింత ఇరకాటంలో పడ్డారు. ఆశిష్ మిశ్రాను నిందితుడి జాబితా నుంచి తప్పించేందుకు అజయ్ మిశ్రా చేస్తున్న ప్రయత్నాలకు ఫొరెనిక్స్ రిపోర్ట్ పెద్ద అడ్డుకట్ట వేసింది. గతంలో ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అసత్యాలు ప్రచారం చేశారు. ఆశిష్ వాహనం నడపలేదని, అసలు ఆశిష్ ఆ వాహనంలో లేరని నిరూపించేందుకు ప్రయత్నించారు. అయితే విచారణలో అవన్నీ అవాస్తవాలని తేలాయి.


ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్‌లో వందలాది మంది రైతులు నిరసన చేపట్టారు. అదే సమయంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ రైతులను తొక్కుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది చనిపోయారు.

Updated Date - 2021-11-09T22:20:02+05:30 IST