అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ కు మరో గుర్తింపు

ABN , First Publish Date - 2021-06-11T22:34:06+05:30 IST

అనేక ప్రత్యేకతలతో ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్ సి ఆర్ ఐ) కు మరో గుర్తింపు దక్కింది.

అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ కు మరో గుర్తింపు

హైదరాబాద్: అనేక ప్రత్యేకతలతో ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్ సి ఆర్ ఐ) కు మరో గుర్తింపు దక్కింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా – ఒక పచ్చని విజేత అవార్డును సాధించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక్కో జిల్లా నుంచి ఒక సంస్థను పరిశుభ్రత, పచ్చదనం పెంపు నిర్వహణ బాగా చేస్తున్న వాటిని గుర్తించారు. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ అవార్డును దక్కించుకుంది.


కొత్త క్యాంపస్ ఏర్పాటైన ఏడాది కాలంలోనే స్వచ్చత, పచ్చదనంలో ఫారెస్ట్ కాలేజీ గణనీయమైన వృద్దిని సాధించింది. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు ఈ ఘనతలో భాగస్వామ్యం అయ్యారు. జాతీయ స్థాయిలో ఈ గుర్తింపునకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రోత్సాహం, ఫ్యాకల్టీ, విద్యార్థుల పట్టుదల కారణమని ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీన్ అన్నారు. మరో సారి ఫారెస్ట్ కాలేజీకి జాతీయస్థాయి గుర్తింపునకు కారణమైన డీన్, సిబ్బంది, విద్యార్థులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు.

Updated Date - 2021-06-11T22:34:06+05:30 IST