నెలాఖరుకల్లా హరిత హారం లక్ష్యాలను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-08-14T01:39:41+05:30 IST

జోరుగా కురుస్తున్న వర్షాలను ఆసరగా చేసుకుని ఈ నెలాఖరుకల్లా ఆరవ విడత హరితహారం లక్ష్యాలను పూర్తిచేయాలని అన్నిజిల్లాల అటవీ అధికారులను అటవీశాఖ ప్రధాన అధికారి ఆర్‌.శోభ ఆదేశించారు.

నెలాఖరుకల్లా హరిత హారం లక్ష్యాలను పూర్తిచేయాలి

హైదరాబాద్‌: జోరుగా కురుస్తున్న వర్షాలను ఆసరగా చేసుకుని ఈ నెలాఖరుకల్లా ఆరవ విడత హరితహారం లక్ష్యాలను పూర్తిచేయాలని అన్నిజిల్లాల అటవీ అధికారులను అటవీశాఖ ప్రధాన అధికారి ఆర్‌.శోభ ఆదేశించారు. హరితహారం కొనసాగుతున్నతీరుపై అరణ్యభవన్‌ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్ప్‌ నిర్వహించారు. ఆరవ విడతలో జిల్లాల వారీగా టార్గెట్‌లు , ఇప్పటి దాకా సాధించిన పురోగతిని సమీక్షించారు. ఈ ఏడాది హరితహారం మొత్తం లక్ష్యం 29.86 కోట్ల మొక్కలుకాగా ఇప్పటి దాకా 21.06 కోట్ల మొక్కలునాటి నట్టు మొత్తం లక్ష్యంలో 70.5 శాతమని హరితహారం ప్రత్యేక అధికారి ఎం.దోబ్రియల్‌ వెల్లడించారు. కామారెడ్డి, వరంగల్‌, మేడ్చల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌ జిల్లాలు మొక్కలు నాటడంలో వెనుకబడి నందున కారణాలను ఆరా తీశారు.


వర్షాలు క్కువగా ఉండడం వల్ల వ్యవసాయం పనులు, కరోనా , ఉపాధి కూలీల వందరోజుల గడువు ముగియడం లాంటి కారణాల వల్ల ప్లాంటేషన్‌ కార్మికుల లభ్యత తగ్గిందని జిల్లాల అధికారులు వెల్లడించారు. ఇక సహజ అడవుల పునర్దురణ లక్ష్యంగా పెట్టుకున్నామని ఈసందర్భంగా పీసీసీఎఫ్‌ శోబ వెల్లడించారు. 

Updated Date - 2020-08-14T01:39:41+05:30 IST