‘ఫారెక్స్‌’ గలగల

ABN , First Publish Date - 2020-07-04T06:37:33+05:30 IST

కొవిడ్‌-19తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. గడచిన నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ వృద్ధి రేటు మైన్‌సకు పడిపోయింది. అయినా భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) ఖజానా గలగలలాడుతోంది. జూన్‌ 26తో ముగిసిన

‘ఫారెక్స్‌’ గలగల

ముంబై: కొవిడ్‌-19తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. గడచిన నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ వృద్ధి రేటు మైన్‌సకు పడిపోయింది. అయినా భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) ఖజానా గలగలలాడుతోంది. జూన్‌ 26తో ముగిసిన వారాంతానికి భారత ఫారెక్స్‌ నిల్వలు 127 కోట్ల డాలర్లు పెరిగి  50,684 కోట్ల డాలర్లకు చేరాయి.  ప్రస్తుత జీడీపీలో ఈ నిల్వలు దాదాపు 20 శాతానికి సమానం. ప్రస్తుత మారకం రేటు ప్రకారం చూస్తే భారత ఫారెక్స్‌ నిల్వలు రూ.38.01 లక్షల కోట్ల స్థాయికి చేరాయి.


టాప్‌ 5 లోకి..

ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు దాదాపు 13 నెలల దిగుమతులకు సరిపోతాయి. అంతేకాకుండా అత్యధిక ఫారెక్స్‌ నిల్వలున్న టాప్‌ 5 దేశాల్లో భారత్‌ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌ కంటే ముందు స్థానాల్లో చైనా, జపాన్‌, స్విట్జర్లాండ్‌, రష్యా ఉన్నాయి. కాగా గడచిన మూడు నెలల్లో దాదాపు 2,500 కోట్ల డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు భారత ఖజానాలో చేరటం విశేషం.  


ప్రయోజనాలేమిటంటే.. 

ఫారెక్స్‌, స్టాక్‌ మార్కెట్లలో ఆటుపోట్లకు కళ్లెం వేసే అవకాశం 

స్పల్ప, మధ్యకాలిక విదేశీ రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవు

సరిహద్దుల్లో పరిస్థితులు క్షీణించినా, దిగుమతుల చెల్లింపులకు ఢోకా ఉండదు


వృద్ధికి కారణాలు

మే నెల నుంచి స్టాక్‌ మార్కెట్లో భారీగా పెరిగిన ఎఫ్‌పీఐల కొనుగోళ్లు

రిలయన్స్‌తో సహా వివిధ సంస్థల్లో కొనసాగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

దిగుమతులు మందగించి కరెంట్‌ ఖాతా లో మిగులు ఏర్పడడం

ప్రవాసుల నుంచి పెరిగిన నిధుల ప్రవాహం

చమురు ధరల పతనం, బంగారం దిగుమతులు క్షీణించడం

Updated Date - 2020-07-04T06:37:33+05:30 IST