తూకాల్లో మోసంపై రైతుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-17T05:38:22+05:30 IST

తూకాల్లో మోసంపై రైతుల ఆగ్రహం

తూకాల్లో మోసంపై రైతుల ఆగ్రహం
మాలోతుతండాలో వ్యాపారులతో ఘర్షణ పడుతున్న గిరిజన రైతులు

నెక్కొండ, మే 16: తండాల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తూకంలో మోసానికి పాల్పడుతున్న వ్యాపారులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో ఘర్షణకు దారితీసింది. మహబూబ్‌నాయక్‌ గ్రామ పరిధిలోని మాలోతుతండాల్లో ఆదివారం చోటు చేసుకుంది. గిరిజన రైతుల కథనం ప్రకారం. సాయిరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యాపారులు అధిక ధరకు మొక్కజొన్నలు కొం టామని రైతును నమ్మించి వారి నుంచి మూడు రోజులుగా మక్కలు కొనుగోలు చేస్తున్నారు. కంప్యూటర్‌ కాంటాతో తూకం వేస్తుడడంతో వ్యాపారుల మోసాలను గిరిజనులు ఆలస్యంగా గుర్తించారు. ఒక బస్తాలో 65 కిలోల మక్కలు నింపి కాంటా పెట్టగా తూకం మాత్రం 50 కిలో లు మాత్రమే చూపుతోంది. అర క్వింటా బస్తాకు దాదాపు 15 కిలోల వరకూ మోసం చేస్తున్నా రు. మోసాన్ని రైతులు గుర్తించి వ్యాపారులతో ఘర్షణకు దిగారు. ఇప్పటి వరకు తండాల్లో దాదా పు 200 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. మార్కెట్‌ అధి కారులకు సమాచార మివ్వడంతో వారుతండాకు చేరుకునేసరికే వ్యాపారులు ఉడాయించినట్లు తెలిసింది. వారు లైసెన్స్‌డ్‌ వ్యాపారులు కారని, వారిపై చర్యలు తీసుకుంటామని మార్కెట్‌ కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-17T05:38:22+05:30 IST