తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన బాబుల్ సుప్రియో

ABN , First Publish Date - 2021-09-18T20:57:53+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో శనివారంనాడు తృణమూల్ కాంగ్రెస్‌లో ..

తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన బాబుల్ సుప్రియో

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో శనివారంనాడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో సుప్రియో ఆ పార్టీలో చేరారు. బాబుల్ సుప్రియో చేరికను స్వాగతిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు కేంద్ర క్యాబినెట్‌ నుంచి ఆయన రాజీనామా చేశారు. కొద్ది వారాల తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు కొందరు బీజేపీ నేతలతో అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయని, సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు పార్టీకి నష్టమని  ఫేస్‌బుక్ పోస్ట్‌లో బాబుల్ సుప్రియో పేర్కొన్నారు.

Updated Date - 2021-09-18T20:57:53+05:30 IST