కర్నూలును న్యాయ రాజధాని చేయడం రాష్ట్ర పరిధిలో లేదు: చింతామోహన్

ABN , First Publish Date - 2021-10-08T19:12:18+05:30 IST

న్యాయ రాజధానిపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ స్పందించారు.

కర్నూలును న్యాయ రాజధాని చేయడం రాష్ట్ర పరిధిలో లేదు: చింతామోహన్

కర్నూలు: న్యాయ రాజధానిపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ స్పందించారు.  హైస్కూలు మంజూరు చేసినంత ఈజీ కాదు, హైకోర్టు మంజూరు చేయడం అని అన్నారు. 1985 నుంచి జుడీషియల్ వ్యవస్థ గురించి తనకు బాగా తెలుసన్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది సుప్రీం కోర్టు కొలీజియం కమిటీ,  హైకోర్టు న్యాయమూర్తులు సమిష్టిగా కలిసి నిర్ణయించాల్సిన అంశమని తెలిపారు. జుడీషియల్ అంశంపై ఎగ్జిక్యూటివ్ జోక్యం తగదని చింతా మోహన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-08T19:12:18+05:30 IST