Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొలం దున్నుతూ గిరిజన రైతు మృతి

అల్లూరు, డిసెంబరు 6 : తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ ఓ గిరిజన రైతు ప్రాణాలు వదిలాడు. స్థానికుల కథనం మేరకు... అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని రాజారామిరెడ్డి గిరిజన కాలనీకి చెందిన యాకసిరి వెంకటేశ్వర్లు (60) సోమవారం ఉదయం ఎడ్లబండి కట్టుకొని పొలానికి వెళ్లాడు. విత్తనాలను చల్లేందుకు నారుమడి సిద్ధం చేసుకునేందుకు మానుతో చదును చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కిద్దిసేపటి తరువాత చుట్టుపక్కల పొలాల్లో పనుల్లో నిమగ్నమైన రైతులు కాడి కట్టిన ఎద్దులు అలాగే పొలంలో నిల్చుని ఉండడం, వెంకటేశ్వర్లు కనపడకపోవడంతో ఎక్కడికో వెళ్లి ఉంటాడని భావించారు. అయినా ఎంతసేపటికీ ఎద్దులు కదలకుండా అలాగే ఉండడంతో ఏమైందోనని దగ్గరికి వచ్చి చూడగా వెంకటేశ్వర్లు అక్కడే బోర్లా పడిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలికి చేరుకున్న వారు గుండెలవిసేలా రోదించారు. దీనిపై స్థానిక పోలీ్‌సస్టేషనులో ఎలాంటి ఫిర్యాదు అందలేదు.


Advertisement
Advertisement