రాజ్యాంగాన్ని అందరూ చదవాలి: Former Governor‌

ABN , First Publish Date - 2021-12-01T15:49:59+05:30 IST

సమాజంలో అంటరానితనం, కుల మతాల మధ్య వ్యత్యాసాలను రూపుమాపడానికి డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగం ఎంతో దోహదపడుతోందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

రాజ్యాంగాన్ని అందరూ చదవాలి: Former Governor‌

హైదరాబాద్/రాంనగర్‌: సమాజంలో అంటరానితనం, కుల మతాల మధ్య వ్యత్యాసాలను రూపుమాపడానికి డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగం ఎంతో దోహదపడుతోందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ ఆనాడు బౌద్ధమతం స్వీకరించకుండా మరో మతంలోకి వెళితే భారతదేశ ప్రజల జీవన విధానం ఇంత గొప్పగా ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీహెచ్‌.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదివి తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సుద్దాల దేవయ్య, బీజేపీ సీనియర్‌ నాయకులు చింత సాంబమూర్తి, జి.మనోహర్‌రెడ్డి, పి.అశోక్‌, ప్రతాప్‌, అంబేడ్కర్‌, శంకర్‌, ఓంప్రకాష్‌, సంపత్‌, గడ్డం నవీన్‌, కార్పొరేటర్లు వై.అమృత, కన్నె ఉమాదేవి, బి.పద్మావెంకటరెడ్డి, నాయకులు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T15:49:59+05:30 IST