యూఎస్‌లో భారత మాజీ షాట్ ఫుట్ పతక విజేత అరెస్ట్ !

ABN , First Publish Date - 2020-08-26T19:44:25+05:30 IST

ఇక్బాల్ సింగ్ అనే భారత మాజీ షాట్ ఫుట్ పతక విజేతను అమెరిక‌న్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూఎస్‌లో భారత మాజీ షాట్ ఫుట్ పతక విజేత అరెస్ట్ !

వాషింగ్ట‌న్ డీసీ: ఇక్బాల్ సింగ్ అనే భారత మాజీ షాట్ ఫుట్ పతక విజేతను అమెరిక‌న్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌ల్లి, భార్య‌ను హ‌త్య చేసిన నేరంలో పోలీసులు సింగ్‌ను అరెస్ట్ చేశారు. పెన్సిల్వేనియాలోని డెలావేర్ కౌంటీలో ఉండే అత‌ను ఆదివారం పోలీసుల‌కు ఫోన్ చేసి తాను త‌న త‌ల్లి, భార్య‌ను హ‌త్య చేసిన‌ట్లు చెప్పాడు. దాంతో పోలీసులు అత‌ని ఇంటికి వెళ్లి చూడ‌గా సింగ్ ఒంటిపై గాయాలు, ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో క‌నిపించాడు. ఇంట్లో భార్య జస్పాల్ కౌర్, త‌ల్లి నసీబ్ కౌర్ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నారు. ఇద్ద‌రినీ అత‌ను గొంతుకోసి హ‌త‌మార్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. వెంట‌నే సింగ్‌ను అదుపులోకి తీసుకుని అత‌ని ఒంటిపై గాయాలు ఉండ‌డంతో చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, సింగ్ 1983లో భార‌త్ త‌ర‌ఫున‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచారు.      

Updated Date - 2020-08-26T19:44:25+05:30 IST