సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇక్బాల్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-08T09:28:34+05:30 IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంవై ఇక్బాల్‌ మృతిచెందారు. 70 ఏళ్ల ఇక్బాల్‌ గుర్గావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించా రు. రాంచీలో 1975లో న్యాయవా

సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇక్బాల్‌ మృతి

సంతాపం తెలిపిన జస్టిస్‌ ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, మే 7: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంవై ఇక్బాల్‌ మృతిచెందారు. 70 ఏళ్ల ఇక్బాల్‌ గుర్గావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించా రు. రాంచీలో 1975లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన జస్టిస్‌ ఇక్బాల్‌ పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం డిసెంబరు 2012 నుంచి ఫిబ్రవరి 2016 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఇక్బాల్‌ మృతి పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఇక్బాల్‌ బాధ్యతల నిర్వహణలో అత్యంత సునిశితంగా, మానవ విలువలతో వ్యవహరించేవారని కొనియాడారు. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై ఇక్బాల్‌ మృతిపై సంతాప సందేశం విడుదల చేసింది.

Updated Date - 2021-05-08T09:28:34+05:30 IST