హోంమంత్రిని చూస్తే.. జాలేస్తోంది: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2021-09-16T21:27:19+05:30 IST

గుంటూరు: ఏపీ హోంమంత్రిని చూస్తే జాలేస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని చట్టం పేరు చెప్పి.. ఉరి శిక్ష, జీవిత ఖైదు శిక్షలు వేశామంటూ.. హోంమంత్రి

హోంమంత్రిని చూస్తే.. జాలేస్తోంది: అయ్యన్నపాత్రుడు

గుంటూరు: ఏపీ హోంమంత్రిని చూస్తే జాలేస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని చట్టం పేరు చెప్పి.. ఉరి శిక్ష, జీవిత ఖైదు శిక్షలు వేశామంటూ.. హోంమంత్రి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేని దిశ చట్టం కోసం రాజమండ్రిలో దిశ స్టేషన్‌ను ప్రారంభించారని విమర్శించారు. హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోడెల కూడా గతంలో హోం మంత్రిగా చేశారని.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కేవలం.. కోడెలను చూసేందుకే విశాఖ నుంచి నరసరావుపేట వెళ్లినట్లు చెప్పారు.


కారులో వచ్చి కోడెల మీటింగ్‌ను దూరం నుంచి విని వెళ్లేవాడినని గుర్తు చేశారు. మరుగు దొడ్లు నిర్మాణ అంశంలో జాతీయ అవార్డు పొందారన్నారు. కోడెలను చూసే.. తన నియోజకవర్గంలో స్మశానాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కోడెల కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. జైలులో చిప్ప కూడు తినాల్సిన వారిని.. సీఎంను చేశారని ధ్వజమెత్తారు. సన్న బియ్యమటే తెలియనోడు పౌర సరఫరాల మంత్రి, బెట్టింగ్ రాయుడు ఇరిగేషన్ మంత్రి అని ఎద్దేవా చేశారు. సీఎం లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడని.. అదంతా ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. ఆఖరికి సినిమా టికెట్లు కూడా అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు.

Updated Date - 2021-09-16T21:27:19+05:30 IST