Abn logo
Jan 19 2021 @ 14:05PM

హైడ్రామాల మధ్య పోలీస్‌స్టేషన్‌కు దేవినేని ఉమా

విజయవాడ: హైడ్రామాల మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉమా పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారని తెలిసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. ఆయనను ఈ రోజు సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచే అవకాశముందని సమాచారం. ఇదిలా ఉంటే, ఉమాపై కేసు నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఉమాపై కేసు నమోదు చేస్తే.. ఈ రోజు రాత్రి స్టేషన్లోనే ఉంచి, బుధవారం కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.

Advertisement
Advertisement
Advertisement