Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేరూరు డ్యాంలో మాజీ మంత్రి గంగపూజ


రామగిరి, నవంబరు 29: మండలంలో పేరూరు (అప్పపెన్నార్‌) ప్రాజెక్టును మాజీ మంత్రి పరిటాల సునీత సోమవారం సాయంత్రం టీడీపీ స్థానిక నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శాస్ర్తో క్తంగా గంగపూజ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ.. .పేరూరు  ప్రాజెక్టుకు 21సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరిందని  సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వద్ద లీకేజీలు అధికంగా ఉన్నాయని, వాటిని అరికట్టేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె పేరూరు డ్యాం వద్దకు వస్తుందని  తెలియ గానే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తు న తరలివచ్చారు. డ్యాంలో పారుతున్న నీటిని చూసి ఆమె రైతులతో ఆనందాన్ని పంచుకుని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. డ్యాం వల్ల ఐదు మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగమన్నారు. డ్యాం లోకి నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడే గేట్లు ఎత్తాలన్నారు. సాధ్యమైనంతవరకు డ్యాంలో నీరు అధికంగా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్యాంలో నీరు ఉంటే  ఈ ప్రాంతమంతా భూగ ర్భజలాలు పెరిగి వేలాది ఎకరాలకు సాగు నీరు అందే అవ కాశం ఉందన్నారు. రామగిరి, కంబదూరు. కనగానపల్లి, రాప్తాడు, చెన్నేకొ త్తపల్లి మండలాలకు ఈ డ్యాం ఎంతో ఉపయోగపడుతుంద న్నారు. ఇప్పటికే సమీప ప్రాంతాలలో భూగర్భజలాలు పెరిగి బావుల్లో , బోరు బావులలో నీరు పెరుగుతోందన్నారు. 


Advertisement
Advertisement