శిలాఫలకంలో పేరేసుకుంటే ప్రధాన కార్యదర్శి కాలేరు!

ABN , First Publish Date - 2021-10-18T18:07:02+05:30 IST

శిలా ఫలకంలో పేరేసుకుంటే ప్రధాన కార్యదర్శి కాలేరని మాజీ మంత్రి డి. జయకుమార్‌ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహి తురాలు శశికళను ఘాటుగా విమర్శించారు. స్థానిక టి.నగర్‌లోని ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద శశికళ ఆవిష్కరించిన

శిలాఫలకంలో పేరేసుకుంటే ప్రధాన కార్యదర్శి కాలేరు!

మాజీమంత్రి జయకుమార్‌ విమర్శ

చెన్నై: శిలా ఫలకంలో  పేరేసుకుంటే ప్రధాన కార్యదర్శి కాలేరని మాజీ మంత్రి డి. జయకుమార్‌ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహి తురాలు శశికళను ఘాటుగా విమర్శించారు. స్థానిక టి.నగర్‌లోని ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద శశికళ ఆవిష్కరించిన శిలాఫలకంలో ప్రధాన కార్యదర్శి వీకే శశికళ అని చెక్కబడి వుండడంపైౖ స్పందించిన జయకుమార్‌ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలన్నీ అన్నాడీఎంకే ఎవరిప క్షమో సుస్పష్టమైన తీర్పులు వెలువరిం చాయని, శశికళ శిలాఫలకంలో ప్రధాన కార్య దర్శిగా పేరేసుకోవడం కోర్టు ఉత్తర్వుల ఉల్లం ఘన కిందకే వస్తుందన్నారు. మీసమున్న వారంతా కట్టబ్రహ్మన్నలు కాలేరని, ఎలాంటి త్యాగాలు చేయని శశికళ తన పేరుకు ముందు త్యాగనాయకురాలని టైటిల్‌ వేసుకో వడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. బెంగళూరు జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎంజీఆర్‌, జయలలిత సమాధులను సందర్శించని శశికళ అన్నాడీఎంకే స్వర్ణోత్సవా లు ఐకమత్యంగా జరుపుకుంటుండటం చూసి సహించలేక చిచ్చుపెట్టేలా పోటీ స్వర్ణోత్సవాలు జరు పుకుంటున్నారని ఆయన విమర్శించారు. శశికళ వల్లే 1996 ఎన్నికల్లో అన్నా డీఎంకే చిత్తుగా ఓడి పోయిందని, శశికళను నాయకురాలిగా పార్టీ శ్రేణు లెవరూ అంగీకరించరని ఆయన చెప్పారు. అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మాత్రమేనని, ఈ విషయమై పార్టీ సర్వసభ్య మండలి సమావేశం సుస్పష్టమైన తీర్మానం కూడా చేసిందని ఆయన గుర్తు చేశారు.

Updated Date - 2021-10-18T18:07:02+05:30 IST