మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు మృతి

ABN , First Publish Date - 2020-05-11T10:32:44+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు (92) ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు మృతి

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

పాల్గొన్న మంత్రులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల/ధర్మపురి మే 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు (92) ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆదివారం అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం,  మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, శ్రీధర్‌ బాబు, పెద్దపెల్లి జడ్పీ చైర్మెన్‌ పుట్ట మధుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు హాజరై నివాళులు అర్పించారు.


సర్పంచ్‌ నుంచి అమాత్యుని వరకు ఎదిగిన జువ్వాడి

జువ్వాడి రత్నాకర్‌ రావు జగిత్యాల జిల్లా ధర్మపురి మండ లం తిమ్మాపూర్‌లో 1929లో అక్టోబరు 4న జన్మించారు. ఈయ నకు భార్య సుమతి, కుమారులు నర్సింగారావు, కృష్ణారావు, చంద్రశేఖర్‌ రావు ఉన్నారు. హెచ్‌ఎస్‌సీ చదువుకున్న ఆయన స్వాతంత్ర్యానికి ముందు పలు ఉద్యమాల్లో పని చేశారు. 1952లో సోషలిస్ట్‌ పార్టీలో చేరిన ఆయన 1953లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో పీసీసీ సభ్యుడిగా, కార్యదర్శిగా, ఏఐసీసీ సభ్యుడిగా పని చేశారు. 1966లో తిమ్మాపూర్‌ సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన 1977 వరకు కొనసాగారు. 1977 నుంచి 1983 వరకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నృసిం హ స్వామి దేవస్థానం చైర్మన్‌గా పని చేశారు.


1981లో జగిత్యాల సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో 1989లో బుగ్గారం ఎమ్మెల్యేగా స్వతం త్య్ర అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందారు. 1989 నుంచి 1994 వరకు వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్‌గా పని చేశారు. 1994లో బుగ్గారం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పో టీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 1999, 2004 ఎన్నికల్లో బుగ్గారం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2007లో వైఎస్‌ఆర్‌ కేబినేట్‌లో దేవాదాయ, ధర్మాదా య, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రిగా 2009 వరకు పని చేశారు. అదే సమయంలో దూప దీప నైవేద్య పథకానికి రూ పకల్పన చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో మెట్‌పల్లి, బుగ్గారం సెగ్మెంట్‌లు రద్దయి కొత్తగా కోరుట్ల సెగ్మెంట్‌గా రూపాంతరం చెందగా, 2009లో అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


రత్నాకర్‌ రావు మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు...

రైతు కుటుంబం నుంచి వచ్చిన రత్నాకర్‌రావు కాంగ్రెస్‌ పా ర్టీలో చేరి రైతు సంక్షేమం, పార్టీ పటిష్ఠత కోసం ఎంతగానో ప ని చేశారు. ఆయన మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటుగా మిగిలింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మంఽథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, మాజీ డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమా ర్‌, వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆది శ్రీనివాస్‌ చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల పశు వైద్య కళాశాలకు రత్నాకర్‌ రావు పేరును పెట్టాలని సూచించారు.


మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ రత్నా కర్‌ రావు రైతుల కోసం ఎంతగానో పని చేశారని, అతి సాధారణ వ్యక్తిగా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా బస్సులోనే ప్రయాణించాడని కొనియాడారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఈటెల రాజేంధర్‌ మాట్లాడుతూ రైతుల కోసం పనిచేశారని అన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.అలాగే మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రత్నాకర్‌ రావు మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయ నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ కవిత, టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఫైనాన్స్‌ ఛైర్మన్‌ రాజే శం గౌడ్‌, జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌, వైస్‌ ఛైర్మన్‌ హరి చరణ్‌ రావు, జగిత్యాల బల్దియా ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌,  టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్నలు రత్నాకర్‌ రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 


తిమ్మాపూర్‌ గోదావరి వద్ద అంత్యక్రియలు

గౌరవ వందనంగా పోలీసులు తుపాకితో కాల్పులు

ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌ గోదావరి వద్ద రత్నా కర్‌రావు అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ పక్షాన అధికార లాంఛనాలతో నిర్వహించారు. రత్నాకర్‌రావు ఆకాంక్ష మేరకు కరీంనగర్‌ నుంచి మధ్నాహ్నం తిమ్మాపూర్‌కు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనంలో తీసుక వచ్చారు. ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీ య నాయకులు కడసారి చూశారు. 

Updated Date - 2020-05-11T10:32:44+05:30 IST