బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా నయనార్‌ నాగేంద్రన్‌

ABN , First Publish Date - 2021-05-10T16:16:26+05:30 IST

రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా తిరునెల్వేలి శాసనసభ్యుడు, మాజీ మంత్రి నయనార్‌ నాగేంద్రన్‌ ఎంపికయ్యారు..

బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా నయనార్‌ నాగేంద్రన్‌

చెన్నై/అడయార్‌: రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా తిరునెల్వేలి శాసనసభ్యుడు, మాజీ మంత్రి నయనార్‌ నాగేంద్రన్‌ ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యే ల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. కాగా శాసనసభలో బీజేపీ రెండు దశా బ్దాల తర్వాత అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ను ఎన్నుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలంతా టి.నగర్‌ లోని కమలాల యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకుడుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎల్‌.మురుగన్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి సీటీ రవి, బీజేపీ తమిళనాడు శాఖ జాతీయ కో-ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొనివున్న కరోనా పరిస్థితులు, అసెంబ్లీలో బీజేపీ పోషించాల్సిన పాత్ర, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆ పార్టీ శాసనసభా నేతగా నయనార్‌ నాగేంద్రన్‌ను ఎన్నుకున్నారు. ఈ వివరాలను కిషన్‌రెడ్డి మీడియాకు వివరించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నయనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వా నికి అన్ని విఽధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శాసనసభలో బాధ్యతా యుత ప్రతిపక్ష పార్టీగా ఉంటామేగానీ, వ్యతిరేకంగా ఉండబో మన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక చొరవచూపిస్తామని తెలిపారు.

Updated Date - 2021-05-10T16:16:26+05:30 IST