2024 ఎన్నికల్లో పోటీకి నేను అర్హుడినే!: మాజీ ఎమ్మెల్యే వంటేరు

ABN , First Publish Date - 2020-10-28T17:58:08+05:30 IST

2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు..

2024 ఎన్నికల్లో పోటీకి నేను అర్హుడినే!: మాజీ ఎమ్మెల్యే వంటేరు

నాటి నైతిక రాజకీయాలు ఇప్పుడేవీ!?

అందరికీ చెప్పే పార్టీ మారుతా

 

కావలి: 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు తాను అన్నివిధాలా అర్హుడని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కావలి జర్నలిస్ట్‌ క్లబ్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడా రు. అధికారులు, నాయకులు చేస్తున్న తప్పులను పత్రికలు నిర్భయంగా ఎత్తిచూపినపుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నాయకులను పొగడ్తలతో ముంచెత్తితే దానివల్ల నా యకులు వాస్తవాలను తెలుసుకోకుండా నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. మున్సిపాలిటీలు జీతాలు చెల్లించలేని తరుణంలో కేంద్రం ప్రకటించిన అమృత్‌ పథకం ప్రాజెక్ట్‌ పనులు మున్సిపాలిటీల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయన్నారు. అలాంటి పథకం పైలాన్‌ను కావలిలో ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. తాను ఎన్టీఆర్‌ అభిమానినని ముసునూరులో ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం చేయటం తనను ఎంతో బాధించిందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడే ఇబ్బందులు ఉంటే దానిని పెట్టకూడదని పెట్టిన తర్వాత ఏ నేతల విగ్రహాలైనా తొలగించడాన్ని తప్పుపడుతూ తిరిగి విగ్రహం ఏర్పాటు చేయడం మం చి సంప్రదాయమన్నారు.


తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు అప్పటి తన ప్రత్యర్థిగా ఉన్న కలికి యానాది రెడ్డితో సఖ్యతగా ఉండి అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. తామిద్దరం రెండు పర్యాయాలు ఒకరిపై ఒకరం పోటీ చేసుకున్నా ఎక్కడా గొడవలు పడలేదని అలాంటి నైతిక రాజకీయాలు ఇప్పుడు కనిపించడం లేదని చెప్పారు. మీరు టీడీపీలో చేరుతారా అని ప్రశ్నించగా ఇ ప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా తన వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నానని చెప్పారు. పత్రికలలో వస్తున్న వార్తలను తాను ఖండించడం లేదని, అలాగని సమర్ధించడం లేదని ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ చెబుతానని మాట దాటవేశారు. అయితే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచనతో పాటు టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వంటేరు తనయుడు బాబీ, ఆయన అనుచరులు రామిరెడ్డి, జేడీ మల్లిఖార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T17:58:08+05:30 IST