పార్కులో నిర్మాణాలు ఆపకపోతే కోర్టును ఆశ్రయిస్తా

ABN , First Publish Date - 2020-10-25T06:15:57+05:30 IST

రాంనగర్‌ పార్కులో నిబంధనలకు విరుద్ధంగా చేప ట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని, లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుం దని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు

పార్కులో నిర్మాణాలు ఆపకపోతే కోర్టును ఆశ్రయిస్తా

మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు


మంచిర్యాల, అక్టోబరు 24: రాంనగర్‌ పార్కులో నిబంధనలకు విరుద్ధంగా చేప ట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని, లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుం దని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. పట్టణ ప్రగతిలో పార్కులను అభివృద్ధి చేసి మొక్కలు పెంచాలని ప్రభుత్వం చెబుతుంటే ఇక్కడ ఉన్న చెట్లను నరికివేసి భవనం నిర్మిస్తున్నారన్నారు. అధికార పార్టీ కౌన్సిల ర్లకు తలొగ్గిన మున్సిపల్‌ అధికారులు రూ.10 లక్షలు మంజూరు చేసి అనుమతులు ఇచ్చారని, అధికారులు ఉద్యోగాలు కాపాడుకోవాలంటే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవా లని సూచించారు. పట్టణ ప్రగతి నిధులు మున్సిపాలిటీకి నెలకు రూ.75 లక్షలు వస్తున్నాయని, వాటిని అన్ని వార్డుల అభివృద్ధికి సమానంగా కేటాయించాలన్నారు. కేవలం అధికార పార్టీ కౌన్సిలర్ల వాడలకు మాత్రమే నిధులు వెచ్చించడం సమం జసం కాదన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపడతున్న వివిధ పనుల్లో భారీ గా కమీ షన్లు పొందుతున్నారని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రస్తావించారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలు చెల్లించినట్లు రికార్డుల్లో నమోదుచేసి పంపకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ప్రతిపక్ష కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డ  చైర్మన్‌పై నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. సత్యనారాయణ, రవి,  తిరుప తి, ఉప్పలయ్య, సంజీవ్‌, అంకం నరేష్‌, సదానందం, అబ్దుల్‌ సత్తార్‌, పాల్గొన్నారు.  


మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జన్మదినం

మంచిర్యాల: మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గాజుల ముకేష్‌గౌడ్‌ జన్మ దినం శనివారం జరిగాయి. ఎమ్మె ల్యే దివాకర్‌రావు హాజరై ముకేష్‌గౌ డ్‌కు స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, విజిత్‌కుమార్‌, గాదె సత్యం పా ల్గొన్నారు. ముకేష్‌గౌడ్‌ అభిమానులు గూడెం ఆలయంలో అభి షేకం చేశారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అబ్దుల్‌ రహీం, సత్యనారాయణరావు, సంతోష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T06:15:57+05:30 IST