Abn logo
May 7 2021 @ 04:09AM

ఈటల వెంటే తెలంగాణ ప్రజలు

బంధువు, మిత్రుడి గానే సానుభూతి తెలిపా

రాజకీయాలు చర్చించలేదు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 


మేడ్చల్‌, మే 6: తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రజలు ఆయన వెంటే నడుస్తారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి విశ్వేశ్వర్‌రెడ్డి మేడ్చల్‌ మండలం పూడూరు శివారులోని ఈటల నివాసానికి వెళ్లి రాజేందర్‌ దంపతులకు సానుభూతి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈటల భార్య జమున తనకు దగ్గరి బంధువని, ఆయన కూడా తనకు పాత మిత్రుడని తెలిపారు. వారు బాధపడడం టీవీల్లో చూసి బంధువు, మిత్రుడిగా సానుభూతి తెలిపేందుకు వచ్చానని అన్నారు. రాజకీయాలు చర్చించలేదన్నారు. కేసీఆర్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సహజమేనన్నారు.

Advertisement