న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ కన్నుమూత

ABN , First Publish Date - 2020-04-07T01:52:46+05:30 IST

న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ జోక్ ఎడ్వర్ట్స్(64) సోమవారం తుదిశ్వాస విడిచారు. దూకుడైన బ్యాటింగ్‌కి ప్రసిద్ధి పొందిన ఆయన 1977లో క్రిస్ట్‌చర్చ్ వేదికగా

న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ కన్నుమూత

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ జోక్ ఎడ్వర్ట్స్(64) సోమవారం తుదిశ్వాస విడిచారు. దూకుడైన బ్యాటింగ్‌కి ప్రసిద్ధి పొందిన ఆయన 1977లో క్రిస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టులోకి ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో అర్థశతకం సాధించి.. గుర్తింపు సంపాదించుకున్నారు. 


1978లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారిగా ఆయన వికెట్‌కీపర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లో ఆయన అర్థ శతకాలు సాధించారు. కానీ, అదే ఏడాది అయితే ఇదే ఏడాది జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో ఎడ్వర్డ్స్ కీపింగ్, బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన్ను మూడేళ్లపాటు జట్టులోకి తీసుకోలేదు. ఆ తర్వాత 1981లో ఆయనకి మళ్లీ జట్టులో చోటు లభించింది. కానీ, ఇయాన్ స్మిత్‌ను జట్టులోకి తీసుకోవడం కోసం ఆయన్ను బలవంతంగా జట్టు నుంచి తప్పించారనే ఉదంతులు ఉన్నాయి. ఆయన మృతిపై పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, బోర్డులు సంతాపం వ్యక్తం చేశాయి. 

Updated Date - 2020-04-07T01:52:46+05:30 IST