Advertisement
Advertisement
Abn logo
Advertisement

Pak:మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కు గుండెపోటు

లాహోర్ (పాకిస్థాన్): పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌కు గుండెపోటు రావడంతో లాహోరులోని ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఇంజమామ్ కు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు.ఇంజమామ్ ఆరోగ్యం నిలకడగా ఉందని లాహోర్ వైద్యులు చెప్పారు. 51 ఏళ్ల ఇంజమామ్ 375 మ్యాచ్ లలో 11,701 పరుగులు చేశారు.119 వన్డే మ్యాచ్ లలో 8,829 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక పరుగులు తీసిన ఆటగాడిగా నిలిచారు.కెప్టెనుగా విజయాలు సాధించిన ఇంజమాన్ 2007లో క్రికెట్ ఆట నుంచి రిటైర్ అయ్యారు. పాక్ బ్యాటింగ్ కన్సల్టెంటుగా, చీఫ్ సెలెక్టరుగా పనిచేస్తున్నారు.ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement